యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం స్టూడెంట్ నెంబ‌ర్ 1. ఈ మూవీ వీళ్లిద్ద‌రికి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందించింది. మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఈ మూవీకి రాజ‌మౌళి డైరెక్ట‌ర్ అనగానే.. చాలా మంది స‌రిగా తీస్తారో లేదో అనుకున్నార‌ట‌. ఫైట్స్ కూడా రాజ‌మౌళినే డిజైన్ చేస్తాన‌ని అన్నాడట‌. దీంతో అస‌లే కొత్త… ఫైట్స్ కూడా రాజ‌మౌళి తీయ‌డం ఏంటి ఫైట్ మాస్ట‌ర్ కి ఇద్దామంటే… ఒక్క ఫైట్ మాత్రం త‌ను డిజైన్ చేస్తాన‌న్నార‌ట జ‌క్క‌న్న‌.

ఆ త‌ర్వాత మూవీ కంప్లీట్ అవ్వ‌డం.. పెద్ద విజ‌యం సాధించ‌డం తెలిసిందే. అయితే.. ఈ సినిమా గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు నిర్మాత అశ్వ‌నీద‌త్. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. ఈ సినిమాని ముందుగా ప్ర‌భాస్ తో చేయాలనుకున్నార‌ట‌. క‌థ రెడీ అవ్వ‌డం.. ప్ర‌భాస్ కి చెప్ప‌డం.. ఓకే అన‌డం జ‌రిగింద‌ట‌. ఇక షూటింగ్ స్టార్ట్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

అయితే.. ఆ టైమ్ లో నంద‌మూరి హ‌రికృష్ణ అశ్వ‌నీద‌త్ కి ఫోన్ చేశార‌ట‌. ఎన్టీఆర్ తో సినిమా చేయ‌మ‌ని చెప్పార‌ట‌. అప్పుడు ఆలోచ‌లో ప‌డిన అశ్వ‌నీద‌త్ ప్ర‌భాస్ తో స్టూడెంట్ నెంబ‌ర్ 1 మూవీ చేయాల‌నుకున్న ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టి ఆ క‌థ‌తో ఎన్టీఆర్ తో సినిమా చేశార‌ట‌. అలా.. ప్ర‌భాస్ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్ తో చేయాల్సివ‌చ్చింద‌ని అశ్వ‌నీద‌త్ బ‌య‌ట‌పెట్టారు. అశ్వ‌నీద‌త్ చెప్పిన ఈ సీక్రెట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

Also Read : బాల‌య్య వెర్సెస్ ప్ర‌భాస్. గెలిచేది ఎవ‌రు..? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *