Tuesday, September 17, 2024
Homeసినిమాసరికొత్త రికార్ట్ సెట్ చేసిన సలార్ టీజర్

సరికొత్త రికార్ట్ సెట్ చేసిన సలార్ టీజర్

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. సలార్ కేజీఎఫ్ లా ఉంటుంది అనుకుంటే.. అంతకు మించి ఉంటుందని ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ టీజర్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 45 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.3 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఈ టీజర్ రిలీజైన 12 గంటల్లోనే 45 మిలియన్స్ కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇది సరికొత్త రికార్డ్ గా నిలిచింది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఇవ్వనున్నారు.

టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కి నాంది పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులే 200 కోట్లకి పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఒక్క తెలుగులోనే బిజినెస్ లో మరోసారి బిగ్గెస్ట్ బిజినెస్ నెంబర్ సలార్ కి లాక్ అయ్యేలా ఉందని చెప్పాలి. అయితే ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు కానీ ప్రస్తుతానికి అయితే చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.. బిజినెస్ లోనూ, కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్