Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్సెమీస్ కు ప్రన్నోయ్

సెమీస్ కు ప్రన్నోయ్

Into Semis: ఇండోనేసియా ఓపెన్-2022 లో భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ ఎస్ ప్రన్నోయ్ సెమీ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన మ్యాచ్ లో డెన్మార్ ఆటగాడు రస్మస్ జేమ్కేపై 21-14,21-12తో విజయం సాధించాడు.

వరల్డ్ ర్యాంకింగ్స్ లో 13వ స్థానంలో ఉన్న రస్మస్ ను, 23వ ర్యాంకింగ్ లో ఉన్న ప్రన్నోయ్ ఈ మ్యాచ్ లో మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండు వరుస సెట్లను చేజిక్కించుకొని టైటిల్ రేసులో నిలబడ్డాడు.

ఇండియా తరఫున ప్రన్నోయ్ ఒక్కడే రెండో రౌండ్ దాటిన సంగతి విదితమే.

రేపు జరిగే సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా ఆటగాడు, ర్యాంకింగ్స్ లో 35వ స్థానంలో ఉన్న ఝావో జున్ పెంగ్ తో తలపడనున్నాడు.

Also Read : ఇండోనేసియా ఓపెన్: ప్రన్నోయ్ ఒక్కడే! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular