Saturday, November 23, 2024
HomeTrending Newsసొంత పార్టీతో ప్రజాక్షేత్రంలోకి పీకే

సొంత పార్టీతో ప్రజాక్షేత్రంలోకి పీకే

 Prashant Kishor Party : రాజకీయాలపై ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏదో ఒక పార్టీ నుంచి ప్రజా క్షేత్రంలోకి రావాలనుకున్న పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి సొంత వేదిక ద్వారా వచ్చేందుకు సమయాత్తమవుతున్నారు. అందుకు తన కార్యక్షేత్రం బీహార్ రాష్ట్రమని కూడా ప్రకటించారు. బీహార్లో కొత్త రాజకీయ పార్టీ ద్వారా తన ప్రస్థానం ప్రారంభించనున్నట్టు ఈ రోజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

జన్ సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన, ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం 10 ఏళ్ల రోలర్‌కోస్టర్ రైడ్‌ ( ఆకస్మిక మరియు తీవ్రమైన మార్పులు) కు దారితీసిందన్నారు. నిజమైన మాస్టర్స్ ప్రజల వద్దకు వెళ్లే సమయం ఆసన్నమైందని,  సమస్యలను బాగా అర్థం చేసుకోవడమే పీపుల్స్ గుడ్ గవర్నెన్స్ మార్గమని తన ట్విట్ లో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి నుంచి ఎందరో ముఖ్యమంత్రుల గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తాజా నిర్ణయం సంచలనంగా మారింది. పీకే స్వరాష్ట్రం బీహార్ లో శాసనసభ ఎన్నికలు 2025 లో ఉండగా ఇప్పుడే ప్రకటన చేయటం చర్చనీయాంశం అయింది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెడితే బీహార్ లో రాజకీయ పరిణామాలు మరుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : ఇచ్చట వ్యూహాలు అమ్మబడును 

RELATED ARTICLES

Most Popular

న్యూస్