Saturday, November 23, 2024
HomeTrending Newsమీరు లేకపోతే నేను లేను: సిఎం జగన్

మీరు లేకపోతే నేను లేను: సిఎం జగన్

I am always there for you: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులకు మరింత మేలు చేసి ఉండేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  పీఆర్సీ సాధన సమితి నేతలు సిఎంను తాడేపల్లిలోని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకూ జరిగిన చర్చలు సఫలీకృతం కావడంతో ఉద్యోగులు నేటి అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించినందుకు ముఖ్యమంత్రికి ఉద్యోగ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉద్యోగులు ఆశించినంత ఇవ్వలేకపోయి ఉండొచ్చని, ఎంత మేలు చేయగాలుతామో అంతా చేశామని చెప్పారు. ఉద్యోగులు లేనిదే తానులేనని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అనామలీస్ కమిటీ కూడా ఉందని, ఎప్పుడైనా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉందని, భావోద్వేగాలకు తావులేదని, సమస్యలుంటే చెప్పొచ్చని, ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని సిఎం స్పష్టం చేశారు.  వెల్లడించారు.

సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦿ రాబోయే రోజుల్లో సీపిఎస్ మీద గట్టిగా పనిచేస్తాం
⦿కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై 11,500  కోట్ల రూపాయల భారం పడుతుంది.
⦿ ఆర్థికంగా పడే భారం ఇది, మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను, వేరే ఉద్దేశ్యం లేదు.
⦿ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… రూ.5725 కోట్లు కూడా ఏదైతే మనం ఒన్ టైం ఇస్తున్నామో… ఇది మీ పోస్ట్ రిటైర్మెంట్ మీకు ఇస్తున్నాం.
⦿ మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు.
⦿ ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి  ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.
⦿ మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం.
⦿ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింప చేశాం, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్స్ అందరి జీతాలు పెంచాం.

Covid Third Wave Omicron
⦿ ఇవన్నింటి వల్ల 2018-19లో ఉన్న రూ.52వేల కోట్లు శాలరీ బిల్లు ఈ సంవత్సరమే రూ.67 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు మరలా సుమారు రూ.11 వేల కోట్లు అదనం.
⦿ ఇలాంటి పరిస్థితుల్లో ఈచర్చలు జరిగాయి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే.. మీరు లేకపోతే నేను లేను.
⦿ అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను.
⦿ ఇది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్ధలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది.
⦿ ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా అడుగులు వేస్తున్నాం.
⦿ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని ఆదేశాలిచ్చాం
⦿ 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం.
⦿ ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి.
⦿ అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.
⦿ ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. అది ఎప్పుడూ మనసులో పెట్టుకొండి. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం.
⦿ మీరు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
⦿ చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు.
⦿ కానీ మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినే ప్రభుత్వం ఉంది.
⦿ మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొండి.
⦿  ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్