Sunday, May 4, 2025
HomeTrending NewsDroupadi Murmu:సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి

Droupadi Murmu:సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. ఇవాళ సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహ‌రించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ సార్టీ నిర్వ‌హించారు. యుద్ధ విమానంలో విహ‌రించిన రెండవ మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. తేజ్‌పూర్ విమానాశ్ర‌యం త‌వాంగ్ సెక్టార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. ఆ తర్వాత యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా దేశాధినేతగా ద్రౌపది ముర్ము ఆ సాహసం చేశారు. అయితే పూణే ఎయిర్ బేస్ సురక్షితమైనది కాగా తేజ్ పూర్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ వివాదాస్పదమైనది కావటం గమనార్హం. తవాంగ్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా యుద్ద విమానాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. అలాంటి ప్రదేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించటంతో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. సైనిక దళాల్లో మనో స్థైర్యం నింపుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్