Saturday, January 18, 2025
HomeTrending Newsఎమ‌ర్జెన్సీ మాయని మచ్చ - రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

ఎమ‌ర్జెన్సీ మాయని మచ్చ – రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

18వ లోక్‌సభలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించింది. ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారు. ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని రాష్ట్రపతి వివరించారు.

ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం అన్నారు.

దేశంలో 1975లో విధించిన ఎమ‌ర్జెన్సీపై రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము కామెంట్ చేశారు. రాజ్యాంగంపై జ‌రిగిన అతిపెద్ద దాడి ఎమ‌ర్జెన్సీ అన్నారు. భార‌త రాజ్యాంగంపై అదో మ‌చ్చ‌లా మిగిలిపోయింద‌న్నారు. ఇదే అంశాన్ని ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధంక‌ర్ కూడా అన్నారు. ఎమ‌ర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశార‌ని ధంక‌ర్ పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో భార‌త్ శ‌ర‌వేగంగా ఆత్మ‌నిర్భ‌ర్ దిశ‌గా వృద్ధి చెందుతోంద‌న్నారు. పేప‌ర్ లీకేజీ లాంటి విష‌యాల్లో ద‌ర్యాప్తు చేపట్టేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్