Saturday, January 18, 2025
HomeTrending Newsఅమెరికాను అనుమతించేది లేదు – పాకిస్థాన్

అమెరికాను అనుమతించేది లేదు – పాకిస్థాన్

Imrankhan rules out military bases for USA

అమెరికా బలగాల కోసం ఎలాంటి బేస్ క్యాంపులకు అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్ని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఆఫ్ఘన్లో కార్యకలాపాల కోసం పాక్ భూభాగం వాడుకునేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెగేసి చెప్పారు. అదే విధంగా తాలిబాన్,ఇసిస్ ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఇస్తోందన్న వార్తల్లో నిజం లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటనను తాలిబాన్ స్వాగతించింది. పాక్ భూభాగం వాడుకుంటామని అమెరికా చెప్పుకోవటం న్యాయవిరుద్దమని తాలిబాన్ అధికార ప్రతినిధి సోహైల్ షహీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  పాకిస్థాన్ తగిన రీతిలో అమెరికాకు జవాబు ఇచ్చిందని ఆయన దోహలో హర్షం వెలిబుచ్చారు. అమెరికా బేస్ క్యాంప్ లకు పాకిస్థాన్ అనుమతిస్తే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని తాలిబాన్ ప్రతినిధి హెచ్చరించారు.

మరోవైపు అమెరికా వాదన భిన్నంగా ఉంది. అమెరికా బేస్ క్యాంపుల కోసం పాకిస్థాన్ తో చర్చలు  కొనసాగుతున్నాయని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు మలి దశలో ఉన్నాయని, ఫలప్రదం అవుతాయనే నమ్మకం ఉందని అమెరికా అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి, సమాచార శాఖ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సైన్ లు స్పష్టత ఇచ్చినా అంతర్జాతీయ మీడియాలో బేస్ క్యాంపుల ఏర్పాటుపై కథనాలు ఆగటం లేదు. భవిష్యత్తులో దక్షిణాసియాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా పాకిస్థాన్ లో మతోన్మాదుల అరాచకాలను కట్టడి చేసేందుకు అమెరికా సాయం కోసం పాక్ సమ్మతిస్తుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్