Tuesday, November 26, 2024
HomeTrending Newsప్రధాని మోడీకి నిరసన సెగ

ప్రధాని మోడీకి నిరసన సెగ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన ఈ రోజు అర్థాంతరంగా వాయిదా పడింది. పంజాబ్లోని ఫిరోజ్ పూర్ లో ఈరోజు మోదీ 42 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. భటిండా విమానాశ్రయంలో దిగిన ప్రధానమంత్రి హుస్సేనివాలాలోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రధాని మోదీని ఆందోళనకారులు అడ్డుకున్నారు. మోదీ కాన్వాయ్ ను 20 నిమిషాల పాటు నిరసనాకారులు అడ్డుకున్నారు. ముందుగా హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉన్నావాతావరణం అనుకూలించని కారణంగా చివరి నిమిషంలో సభాస్థలికి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

ఈ క్రమంలో హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నారు. దాదాపుగా 15-20 నిమిషాలు ఫ్లై ఓవర్ పైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తిరిగి భటిండా వచ్చిన ప్రధాన మంత్రి ఢిల్లీ తిరిగి వెళ్లి పోయారు. అనివార్య కారణాల వాళ్ళ ప్రధాని మోదీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ఫిరోజ్ పూర్ లో కేంద్రమంత్రి మన్సుఖ్ మండవియ ప్రకటించారు.

అయితే దేశ ప్రధాని కార్యక్రమానికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమైందని.. కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్