Sunday, February 23, 2025
HomeTrending Newsపోప్ తో మోడీ భేటి

పోప్ తో మోడీ భేటి


Prime Minister Narendra Modi Called On Pope Francis At Vatican City :

ఇటలీలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు వాటికన్ సిటీ లో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశమయ్యారు. మోడీకి వాటికన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఇరువురూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.  పోప్ తో సమావేశం ఎంతో ఆహ్లాదకరంగా సాగిందని, ఎన్నో అంశాలపై విస్తృత స్థాయి చర్చలు సాగాయని, ఇండియాలో పర్యటించాల్సిందిగా ఆయన్ను కోరానని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జి-20 గ్రూప్ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు మోడీ ఇటలీ వెళ్ళారు. నిన్న యురోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్, ఇటలీ ప్రధాని మారియోతో సమావేశమయ్యారు. రోమ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఇటలీలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులతో అయన సమావేశమయ్యారు.

Must Read :విద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

RELATED ARTICLES

Most Popular

న్యూస్