Friday, November 22, 2024
HomeTrending Newsమోడీ – బైడేన్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి

మోడీ – బైడేన్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి

ప్రధానమంత్రి నరేంద్రమోడి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య దేశాల సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళుతున్న మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ తో సమావేశం కానున్నారు. ఈ నెల 24వ తేదిన జరగనున్న మోడీ – బైడేన్ సమావేశంలో వివిధ అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం, ఉగ్రవాదం సవాళ్లు, వాతావరణ మార్పులు-పరిరక్షణ, కరోనా కట్టడితో పాటు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతంపై నేతలు చర్చించనున్నారు. జో బైడేన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నరేంద్రమోడి మొదటిసారి అమెరికా పర్యటన, ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఉన్నారు.

అమెరికా పర్యటనలో నరేంద్ర మోడీ క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొంటారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా సభ్య దేశాలుగా క్వాడ్ కూటమి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం, పొరుగు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై క్వాడ్ కూటమి చర్చిచనుంది. కూటమి నేతలు కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్ళు వర్చువల్ సమావేశాలకే పరిమితం అయ్యారు. మొదటి సారిగా నాలుగు దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్