Sunday, January 19, 2025
HomeTrending Newsఎల్లుండి సీఎంలతో ప్రధాని సమావేశం

ఎల్లుండి సీఎంలతో ప్రధాని సమావేశం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. అలాగే రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో ప్రధానమంత్రి మాదకద్రవ్యాల అక్రమరవాణా, నక్సల్స్ సమస్యలతో పాటు వివిధ అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా కేసులు మళ్ళీ పెరగటం కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసి అన్ని వర్గాలకు చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

Also Read : 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ పర్యటనకు మోడీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్