Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్పుజారా స్థానంలో పృథ్వీ షా : హాగ్ సలహా

పుజారా స్థానంలో పృథ్వీ షా : హాగ్ సలహా

భారత టెస్ట్ క్రికెట్ జట్టులో నంబర్ 3 స్థానంలో ఛతేశ్వర్ పుజారాకు బదులు పృథ్వీ షా ను ఎంపిక చేయాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సూచించాడు. పుజారా కంటే షా ఆ స్థానంలో మెరుగైన ఆట ప్రదర్శించే అవకాశం ఉందని, ఇంగ్లాండ్ సిరీస్ కు ఈ మార్పు చేయాలని సలహా ఇచ్చాడు.

33 సంవత్సరాల సీనియర్ ఆటగాడు పుజారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్ లో 54బంతుల్లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 80 బంతులాడి కేవలం 15  పరుగులే చేశాడు. క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పుజారా, కోహ్లిలు మరి కాసేపు క్రీజ్ లో ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డారు. దీనితో ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు పుజారాకు అవకాశం దక్కడం అనుమానమే.

టెస్టు జట్టును ప్రక్షాళన చేయాల్సి ఉందని డబ్ల్యూ.టి.సి. ఫైనల్ అనంతరం కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు, కొందరు ఆటగాళ్ళు స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు. దీనితో పుజారాకు ఉద్వాసన ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

డబ్ల్యూ.టి.సి. ఫైనల్ లో రోహిత్ శర్మకు జోడీగా ఇండియా ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన శుభమన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో పృథ్వీ షాను ఇంగ్లాండ్ పంపాలని బిసిసిఐ భావిస్తోంది. దీనిపై రేపో మాపో నిర్ణయం తీసుకోనుంది. గిల్ స్థానంలో ఓపెనర్ గా హనుమ విహారి, కే ఎల్ రాహుల్ పేర్లు పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్