Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ నేడు జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది, మరో మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది.
హర్యానా స్టీలర్స్ – గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో హర్యానా 38-36 తో గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో హర్యానా 22-10తో భారీ ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో భాగంలో గుజరాత్ పుంజుకొని హర్యానాపై పైచేయి సాధించి 26-16 తో లీడ్ సంపాదించినా రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. హర్యానా కెప్టెన్ వికాస్ కందాలా తొమ్మిది టచ్, ఒక టచ్, ఒక టాకిల్ తో మొత్తం 11 పాయింట్లు సాధించాడు.
బెంగుళూరు బుల్స్- పునేరి పల్తాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో బెంగుళూరు 40-29 తో విజయం సాధించింది. ఆట తొలి భాగంలో పూణే ధాటిగా ఆడి 18-13 తో ఆధిక్యంలో ఉంది. కానీ రెండో అర్ధ భాగంలో బెంగుళూరు విజ్రుంభించి 27-11 తో తిరుగులేని ఆధిక్యం సంపాదించి 11 పాయింట్లతో విజయం సాధించింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ తొమ్మిది టచ్; రెండు బోనస్ తో మొత్తం పాయింట్లు సంపాదించాడు.
బెంగుళూరు 23 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా ఢిల్లీ (21); యూ ముంబా(17); పాట్నా పైరేట్స్ (16); తమిళ్ తలైవాస్ (14); గుజరాత్ జెయింట్స్ (13) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: నేటి మూడు మ్యాచ్ లూ డ్రా!