Sunday, March 15, 2026
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: జైపూర్ కు రెండో విజయం

ప్రొ కబడ్డీ: జైపూర్ కు రెండో విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు ఆరోరోజు జరిగిన మొదటి మ్యాచ్ డ్రా కాగా రెండో మ్యాచ్ లో జైపూర్  విజయం సాధించింది

తమిళ్ తలైవాస్- యూ ముంబా  మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రా (30-30)గా ముగిసింది. చివరి 20 సెకన్ల నాటికి ముంబై ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది, స్టార్ రైదర్ అజిత్  ముంబై తరఫున రైడింగ్ కు వెళ్ళాడు. పాయింట్ సాధించి గెలిపిస్తాడని అంతా ధీమాగా ఉన్నారు, కానీ తలైవా ఆటగాళ్ళు అజిత్ ను దొరక బుచ్చుకొని పాయింట్ సాధించి డ్రా చేసుకున్నారు. తొలి అర్ధ భాగంలో తమిళ్ తలైవాస్ 17-14 తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ముంబై పుంజుకొని పైచేయి సాధించింది. చివరి నిమిషంలో అంచనాలు తారుమారు కావడంతో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో భాగంలో తమిళ్-ముంబై లు 13-16 పాయింట్లు సాధించాయి.

జైపూర్ పింక్ పాంథర్స్ – యూపీ యోధ  మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో  జైపూర్ 32-29 తో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో జైపూర్ 19-12 తో ఏడు పాయిట్ల ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో యూపీ రాణించి 17-13 తో ఆధిక్యం సాధించినా… చివరి రైడ్ లో రెండు పాయింట్లు సంపాదించి జైపూర్ గెలుపొందింది.

ముంబై ఆటగాడు అజిత్ 15 పాయింట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు, వీటిలో 13 టాకిల్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: బెంగుళూరు విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular