Saturday, January 18, 2025
HomeTrending Newsగ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు గ్రీన్ సిగ్నల్

గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు గ్రీన్ సిగ్నల్

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జి ఓ ఎమ్ ఎస్ నెంబర్ 5 ద్వారా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్ళుగా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఉపశమనం లభించినట్టైంది.

సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్