తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిథిగా ధాన్యం కొనుగోలు చేపడతామని వెల్లడించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కే ధాన్యం సేకరించనున్నట్టు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సిఐ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం (ఎంఒయు) ప్రకారం తెలంగాణలో ధాన్యం సేకరణ కొనసాగుతోందని, నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్టుగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందనే తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రస్తుతమున్న ఎమ్మెస్పీతో యథాతథంగా కొనసాగనుందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పష్టం చేసింది
Also Read : ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు !