Saturday, November 23, 2024
HomeTrending Newsఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు

ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు

Protests Against The Imran Khan Government :

పాకిస్తాన్ ప్రధానమంత్రి అంతర్జాతీయ బిచ్చగాడిగా మారాడని జమాత్ ఏ ఇస్లామి అధినేత సిరాజ్ ఉల్ హక్  విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగితేనే పాకిస్తాన్ సమస్యలు తీరుతాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లాహోర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సిరాజ్ దేశంలో పరిస్థితులు దిగాజారాయని, ఆర్థికంగా, భద్రతా పరంగా ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. పెట్రోలియం రెట్ల నుంచి పప్పుల ధరల వరకు ఏవీ సామాన్యులకు అందుబాటులో లేవని, ప్రపంచ బ్యాంకు అప్పులకు అర్రులు చాచటం తప్పితే ఇమ్రాన్ పాలనతో ఒరిగింది ఏమి లేదని సిరాజ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దింపి ఎన్నికలు నిర్వహించటం తప్పితే దేశ సంక్షేమానికి మరో మార్గం లేదన్నారు.

మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాలనపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కు జటిలమైన సమస్యగా మారారని, అంతర్జాతీయంగా మద్దతు సంపాదించగలిగిన స్థాయి ఇమ్రాన్ కు లేదని, ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వ దౌత్యం విఫలమై దుష్పలితాలు ఇస్తోందని భుట్టో ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ హామీలు ప్రకటనల్లో తప్పితే ఆచరణలో ఎక్కడ అమలు కావటం లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత మరియం నవాజ్ ధ్వజమెత్తారు. ఆజాద్ కాశ్మీర్ లో దొంగ దారిలో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ ప్రజా సంక్షేమం మరచి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. శీతాకాలంలో కూడా  గిల్గిత్ బాల్టిస్తాన్ లో కరెంటు కోతలు, ధరల పెరుగుదలతో ప్రజలు దినమొక గండంగా జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : లాక్ డౌన్ ప్రసక్తే లేదు – పాకిస్తాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్