Tuesday, March 10, 2026
HomeTrending Newsతెలంగాణలో మహిళలకు రక్షణ లేదు - రేణుక చౌదరి

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు – రేణుక చౌదరి

రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళల పై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల లెక్కల చూస్తే..మహిళలల పై రేప్ కేసులు పెరిగాయన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మహిళలతోపాటు పసి పిల్లలకు కూడా తెలంగాణలో రక్షణ లేదని ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

పబ్ లకు సంబంధించి వేల కేసులు నమోదయితే..46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడిందని, మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునంధన్ రావు దోషే అని రేణుక చౌదరి స్పష్టం చేశారు. రఘునంధన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదని, రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటె…రఘునంధన్ రావు బయట పెట్టాలని రేణుక చౌదరి సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో బాదిరాలికి న్యాయం జరిగే వరకు వదిలేది లేదని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయని, నగరంలో రక్షణ లేనప్పుడు.. పెట్టుబడులు ఎలా వస్తాయని రేణుక చౌదరి అన్నారు. బీజేపీ విషయంలో టిఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని, బీజేపీ, టిఆర్ఎస్ తోడుదొంగలు ,కవల పిల్లల లాంటి వారని విమర్శించారు. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగిందని, లైసెన్స్ లు ఇస్తుంది..ఎక్సైజ్ శాఖనే కదా అన్నారు. బీజేపీ మరోమతాన్ని కించరపరచడం సరైంది కాదన్నారు. ప్రపంచం ముందు సిగ్గుపడేలా బీజేపీ నేతల వ్యవహారం ఉందని రేణుక చౌదరి పేర్కొన్నారు.

Also Read ఒక గంజి…ఒక కన్నోవా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular