Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్India Tour of WI: పుజారా, ఉమేష్ డ్రాప్, షమీకి రెస్ట్

India Tour of WI: పుజారా, ఉమేష్ డ్రాప్, షమీకి రెస్ట్

అందరూ అనుకున్నట్లే జరిగింది, కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను వెస్టిండీస్ టూర్ నుంచి తప్పించారు. ఉమేష్ యాదవ్ ను కూడా పక్కన పెట్టారు. బౌలర్ మహమ్మద్ షమికి విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, ఇటీవలి ఐపీఎల్ లో సత్తా చాటిన యశస్వి  జైశ్వాల్ లను జట్టులోకి తీసుకున్నారు. గత సంవత్సర కాలంగా టెస్ట్ జట్టుకు దూరమై ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో జట్టులో చేరిన అజింక్యా రెహానేకు టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ లభించింది. ఆంధ్రా ప్లేయర్ కెఎస్ భరత్ తన స్థానం పదిలం చేసుకున్నాడు.

టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, జైస్వాల్, అజింక్యా  రహానే (వైస్ కెప్టెన్) , KS భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, నవదీప్ షైనీ.

ఇక వన్డేల విషయానికి వస్తే రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించారు.

వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి,  సూర్య కుమార్ యాదవ్, , సంజు  శామ్సన్ (వికెట్ కీపర్ ) , ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్