Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో యూపీ యోధ– పునేరి పల్టాన్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో 44-38తో పూణే విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 21-18తో ఆధిక్యం సంపాదించిన పూణే ద్వితీయార్ధంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగించి 23-20తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 6 పాయింట్ల ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకుంది.
పూణే ఆటగాళ్ళు మోహిత్ గయట్-14, అస్లామ్ ఇనాందార్-12 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. యూపీ ఆటగాడు సురేందర్ గిల్ 16 పాయింట్లతో రాణించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… బెంగుళూరు బుల్స్ (46 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (43); హర్యానా స్టీలర్స్ (42); యూ ముంబా (41); బెంగాల్ వారియర్స్ (41); పాట్నా పైరేట్స్ (40) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Must Read :ప్రొ కబడ్డీ బెంగుళూరుపై ముంబై విజయం