Thursday, March 28, 2024
Homeసినిమాపునీత్ పుట్టినరోజున ‘జేమ్స్’ విడుదల

పునీత్ పుట్టినరోజున ‘జేమ్స్’ విడుదల

James: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డే‌కి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్