Friday, March 29, 2024
HomeTrending Newsఉత్తరప్రదేశ్ లో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్ లో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్‌లో కమలానికే రెండోసారి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అయ్యాయి. యూపీలో 70 సంవత్సరాల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. యూపీలో మరోసారి అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెల్లింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను అధిగమించింది కాషాయ జెండా. స్థానిక పార్టీలతో కలిసి కూటమిగా ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ జట్టు కట్టినా..ఆయనకు నిరాశే మిగిలింది. యోగి హవా ముందు కాంగ్రెస్, బీఎస్పీ, AIMIM పార్టీలకు పరాభవం తప్పలేదు.

ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మెజార్టీ సీట్లను కమలం పార్టీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కొద్దిగా తగ్గినా.. యోగి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా కనిపిస్తోంది.ఓబీసీలు యోగి నాయకత్వానికే మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించడంతో మళ్లీ ఆయనే సీఎం కానున్నారు. స్వాతంత్రం వచ్చాక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక సీఎం పూర్తి పదవీ కాలం ముగించుకున్నాక రెండోసారి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు అఖిలేష్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. 1996 తర్వాత ప్రతిపక్ష పార్టీకి వంద సీట్లు దాటడం ఇదే మొదటిసారి.  సమాజ్ వాదీ పార్టీకి వంద సీట్లు దాటడం ఆ పార్టీ వర్గాల్లో కొంతమేర జోష్ తెచ్చినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో ప్రతిపక్షం ఎప్పుడూ 50 స్థానాల కంటే ఎక్కువ విజయం సాధించిన సందర్భాలు లేవు. ఈ ఎన్నికల్లో యూపీలో ఎంఐఎం పార్టీ ఓటింగ్ శాతం పెంచుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

గతంలో 4 సార్లు యూపీని పాలించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. ఎక్కడా ఏనుగు గుర్తు ప్రభావం చూపలేదు. హస్తం కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కాంగ్రెస్ కు కలిసి రాలేదు. ప్రియాంక గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికి ఎన్నికల ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. యూపీలో ఆసక్తికర పరిణామం.. 500 ఓట్ల తేడాతో 100 సీట్లలో హోరాహోరీ పోరు కొనసాగింది. 100 సీట్లలో ఎస్పీ, బీజేపీ మధ్య కేవలం 500 ఓట్ల తేడా ఉంది..

 

ఉత్తరప్రదేశ్ లో మొత్తం సీట్లు 403 సీట్లు. బిజెపి 255 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. సమాజ్ వాది పార్టీ 111  సీట్లు కైవసం చేసుకుంది. అప్నాదళ్ – 12, RLD-08, SBSP -06, నిషాద్ పార్టీ – 06 కాంగ్రెస్-02,  బిఎస్పి – ౦1, ఇతరులు –02

Also Read : మణిపూర్ సిగలో కమల వికాసం

RELATED ARTICLES

Most Popular

న్యూస్