Tuesday, March 10, 2026
HomeTrending Newsపునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

Puneeth Rajkumar Admitted In Hospital With Severe Heart Attack :

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. నేటి ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగుళూరు విక్రం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీ యూ లో ఉంచి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకొని పునీత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేల సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. వందలాది మంది ఆస్పత్రికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన్ను ఉదయం 11.30 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకు వచ్చారని, అప్పటికే అయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని విక్రమ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి వైద్యుడు డా. రంగనాథ నాయక్ ఓ ప్రకటనలో  వెల్లడించారు.

Must read : ఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular