Friday, April 19, 2024
HomeTrending Newsపంజాబ్ లో అవినీతి నిరోధానికి హెల్ప్ లైన్

పంజాబ్ లో అవినీతి నిరోధానికి హెల్ప్ లైన్

Punjab Anti Corruption Helpline :

పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా తొలి అడుగు వేసింది. పంజాబ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు లంచం అడిగినా తన ఫోన్ కు వివరాలు పంపాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ రోజు ప్రకటించారు. అవినీతి అంతానికి వాట్సప్ ఫోన్ నంబరు కేటాయిస్తున్నట్టు సిఎం వెల్లడించారు.  మార్చి 23వ తేదిన షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చండీఘడ్ లో వెల్లడించారు. ఫిర్యాదుల కోసం తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇస్తానని, లంచం అడిగిన వారి వీడియో లేదా ఆడియో రికార్డు చేసి పంపిస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సిఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో 99 శాతం మంది నిజాయితిగా విధులు నిర్వహించే వారే ఉన్నారని ఒక శాతం ఉన్న అవినీతి పరులు సమాజానికి చీడ పీడగా దాపురించారని సిఎం అన్నారు.

మరోవైపు పంజాబ్ లో కొత్తగా ఎన్నికైన సభ్యులు విధానసభలో ఈ రోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ కొత్త శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని పిసిసి మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు అభినందించారు. పంజాబ్లో మాఫియాకు వ్యతిరేకంగా కొత్త శకం ప్రారంభం కాబోతోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను ఉద్దేశించి సిద్దు వ్యాఖ్యానించారు.

పంజాబ్ లో అవినీతి, మాదక ద్రవ్యాల మాఫియా అంతమొందిస్తామని ఆప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. మాదక ద్రవ్యాల వాడకంతో పంజాబ్ యువతలో 80 శాతం మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే భగవంత్ మాన్  ప్రమాణ స్వీకర కార్యక్రమంపై విమర్శలు కూడా వస్తున్నాయి. షహీద్ భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖడ్ఖర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసి దేశమంతా సంతోషించింది. కానీ పార్కింగ్ కోసం 40 ఎకరాల గోధుమ పంటను ధ్వంసం చేయడాన్ని ఎవరూ హర్షించలేక పోతున్నారు. మిగతా పార్టీల లాగే వ్యవసాయం పట్ల పెద్ద గౌరవం లేదని నిరూపించుకుంది AAP. ఏకరాకు 46 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తే మాత్రం కోతకొచ్చిన పంటను నాశనం చేయడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్