Saturday, January 18, 2025
Homeసినిమాఆ ముగ్గురిలో... పూరి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో?

ఆ ముగ్గురిలో… పూరి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో?

విజయ్ దేవరకొండతో  పూరి జ‌గ‌న్నాథ్ తీసిన ‘లైగ‌ర్’ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. దీంతో విజ‌య్, పూరి కాంబోలో స్టార్ట్ అయిన జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అఫిషియ‌ల్ గా ప్రకటన ఏదీ రాకపోయినా ఆగిపోయిందనేది వాస్త‌వం అని టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. పూరి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. త‌న‌యుడు ఆకాష్ తో పూరి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మోహ‌బూబా సినిమాతో ఆకాష్ ని హీరోగా ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాలో ఆకాష్ కి న‌టుడుగా పేరు వ‌చ్చింది కానీ.. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం రాలేదు. అందుచేత పూరి త‌దుప‌రి చిత్రాన్ని ఆకాష్ తో చేసి స‌క్సెస్ ట్రాక్ లోకి పెట్టాల‌ని చూస్తున్నాడు.

అలాగే నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో పూరికి మంచి అనుబంధం ఉంది. పైసా వ‌సూల్ చేసిన‌ప్ప‌టి నుంచి మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు బాల‌య్య‌తో పూరి ప్రాజెక్ట్ సెట్ అయ్యింద‌ని స‌మాచారం. కాక‌పోతే బాల‌య్య మ‌లినేని గోపీచంద్ తో మూవీ, అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన త‌ర్వాత పూరితో బాల‌య్య సినిమా ఉంటుంది. ఇక రామ్ తో పూరి ఇస్మార్ట్ శంక‌ర్ మూవీని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. ఆత‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ 2 చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా ఆకాష్, బాల‌య్య‌, రామ్ ఈ ముగ్గురు హీరోలతో పూరి వర్క్ చేసే అవకాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  మ‌రి.. ఈ ముగ్గురులో ఎవ‌రితో పూరి మూవీ ఫ‌స్ట్ ఉంటుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : బాలీవుడ్ హీరోల‌తో పూరీ సినిమాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్