‘పుష్ప-2’ రిలీజ్ కూడా డిసెంబర్ లోనే?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో  రూపొందిన ‘పుష్ప’ 400 కోట్ల‌ రూపాయలకు పైగా క‌లెక్ట్  చేసి సంచలన విజ‌యం సాధించింది. ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాను 2022 డిసెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశాడు.

దీంతో 2021 డిసెంబర్ లో ‘పుష్ప‘ పార్ట్ 1 విడుదల అయిన‌ట్టుగానే.. 2022 డిసెంబర్ లో పార్ట్ 2 వస్తుందని అంతా భావించారు కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. మొన్నటి వరకు వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప పార్ట్ 2 వస్తుందని భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… డిసెంబర్ సెంటిమెంట్ మిస్ చేయకుండా పుష్ప 2 ని వచ్చే ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

సినిమా షూటింగ్ ప్రారంభం అయితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరు నెలల సమయంలో పూర్తి చేసేలా సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సారి పుష్ప 2 లో కనిపించబోతున్న నేపథ్యంలో బాలీవుడ్  ప్రేక్షకులు మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: పుష్ప2 లో మిల్కీబ్యూటీ ఐటం సాంగ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *