Monday, May 20, 2024
Homeసినిమా‘పుష్ప’ ట్రైల‌ర్ ఎప్పుడు?

‘పుష్ప’ ట్రైల‌ర్ ఎప్పుడు?

Pushpa-Trailer:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఈ భారీ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లారీడ్రైవ‌ర్ గా న‌టిస్తున్న పుష్పరాజ్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక న‌టించింది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరిట క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇక ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబ‌ర్ 2న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.  ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లో అల్లు అర్జున్ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నార‌ని ఇటీవల వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఒక్క తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నార‌ట‌, ఇతర భాష‌ల్లో  వేరే వారితో డ‌బ్బింగ్ చెప్పించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌చారంలో ఉన్న‌ట్టు డిసెంబ‌ర్ 2న పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారా? లేదా అనేదానిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.

Also Read : ‘పుష్ప ది రైజ్‌’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్