Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్బి.డబ్ల్యూ.టి. ఫైనల్లో సింధు

బి.డబ్ల్యూ.టి. ఫైనల్లో సింధు

Sindhu in Title race:
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2001 లో మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నిలిచింది. నేడు జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 21-15; 15-21; 21-19 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది

వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న సింధు నంబర్ టూలో కొనసాగుతున్నయమగుచితో సెమీఫైనల్లో తలపడింది. తొలి సెట్ ను 21-15 తో సునాయాసంగా గెల్చుకున్న సింధు రెండో సెట్ ను  అదే స్కోరుతో కోల్పోయింది. మూడో సెట్ లో ఇద్దరూ హోరాహోరీ పోరాడారు… చివరకు సింధు 21-19 తో గెల్చుకుని మరో టైటిల్ పోరులో నిలిచింది.

నేడు జరిగిన మరో సెమీఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి, అన్ సెయంగ్,  వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్నథాయ్ లాండ్  కు చెందిన చోచువోంగ్ ను ­25-23; 21-17 తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

రేపు జరిగే ఫైనల్లో పివి సింధు, సెయంగ్ (వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానం) తో తలపడనుంది.

Also Read : పది వికెట్లూ అజాజ్ కే – ఇండియా 325 ఆలౌట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్