Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్Singapore Open : మహిళల సింగిల్స్ విజేత సింధు

Singapore Open : మహిళల సింగిల్స్ విజేత సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సింగపూర్ ఓపెన్ ­-2022 విజేతగా నిలిచింది.  మహిళల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన ఫైనల్స్ లో చైనా క్రీడాకారిణి వాంగ్ జీ పై 21-9; 11-21; 21-15తేడాతో విజయం సాధించింది.

తొలి సెట్ ను సునాయాసంగా గెల్చుకున్న సింధు రెండో సెట్ లో ఓటమి పాలైంది. కానీ మూడో సెట్ లో తేరుకొని తనదైన సర్వీసులతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ గెల్చుకుంది.

ఈ ఏడాడి సింధు గెల్చిన మూడో టైటిల్ ఇది. జనవరిలో ఢిల్లీలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్-2022, మార్చిలో స్విట్జర్లాండ్ లో జరిగిన స్విస్ ఓపెన్-2022 లను గెల్చుకోగా నేటి సింగపూర్ తో మూడో టైటిల్ ను సింధు కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్