Sunday, September 8, 2024
Homeసినిమాచివరి షెడ్యూల్‌ లో ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌

చివరి షెడ్యూల్‌ లో ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌

Gaali Vaana: బిబిసి స్టూడియోస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెర పై కూడా విజయాలు అందుకున్నారు.

సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్‌ కుమార్‌, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్‌ సిరీస్‌తో బిబిసి రీజనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రాంతీయ టెలికాం శిక్షణా కేంద్రంలో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా సీనియర్‌ నటి రాధిక మాట్లాడుతూ… శరత్‌ మరార్‌ గారిని చిరంజీవి గారితో చాలాసార్లు చూశాను. ఆయన  నన్ను కలిసి వెబ్‌ సిరీస్‌ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటి వరకు ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు. కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్‌ చాలా చక్కగా కుదిరాయి. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌. ఇంతమంచి ప్రాజెక్టులో వర్క్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను డబ్బింగ్‌ చెప్పేటప్పుడు చూశాను. అన్ని పాత్రలూ చక్కగా కుదిరాయి. నేను ఈ పాత్ర చేసిందుకు గర్వంగా ఉంది. సాయికుమార్ గారు అద్భుతంగా చేశారు. జీ5, బిబిసి కొలాబ్రేషన్‌లో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ “సీనియర్‌ నటి రాధిక గారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమెతో చేయాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ ‘గాలివాన’తో ఆమెతో నటించాలనే కోరిక తీరింది.  ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్‌ వంటి యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అండ్‌ థ్రిల్‌ను కలిగిస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్న నేను ఇప్పటి వరకు వెబ్‌ సిరీస్‌ కథలు చేయలేదు. అయితే.. దర్శకుడు శరణ్‌ చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ ‘గాలివాన’ ప్రేక్షకులనందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సిరీస్‌ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్