Friday, March 29, 2024
Homeసినిమా`ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో ఖుష్బూ, రాధిక, ఊర్వ‌శి

`ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో ఖుష్బూ, రాధిక, ఊర్వ‌శి

హీరో శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ దర్శకత్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌హిళల‌ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శి భాగ‌మ‌య్యార‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. సినిమాలో ముగ్గురు మ‌హిళ‌ల పాత్ర ఎంతో కీల‌కంగా ఉండ‌టంతో ఆ పాత్ర‌ల‌ను చేయ‌డానికి చాలా అనుభ‌వం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవ‌స‌రం కావ‌డంతో మేక‌ర్స్..ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శిల‌ను ఆ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ పాత్ర‌ల‌ను ఈ సినిమాలో ప్ర‌త్యేకంగా మ‌లిచారు డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్నషూటింగ్‌లో వీరు ముగ్గ‌రు జాయిన్ అయ్యారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అదిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్న ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ప‌నిచేస్తున్నారు. శర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఊర్వ‌శి, వెన్నెల కిషోర్‌, ర‌వి శంక‌ర్‌, స‌త్య‌, ప్ర‌దీప్ రావ‌త్‌, గోప‌రాజు, బెన‌ర్జీ, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీనాయ‌ర్‌, ఝాన్సీ, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, ఆర్‌సీఎం రాజు త‌దిత‌రులు నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్