Sunday, January 19, 2025
HomeTrending NewsCongress: సిడబ్ల్యూసి సభ్యుడిగా రఘువీరా

Congress: సిడబ్ల్యూసి సభ్యుడిగా రఘువీరా

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎన్. రఘువీరారెడ్డి  ఈ  పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సభ్యునిగా నియమితులయ్యారు.  అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే  ఈ కమిటీని నియమించారని ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

 మొత్తం 39  మంది సభ్యులు సిడబ్ల్యూసి సభ్యులు ఉండగా, 18 మంది శాశ్వత ఆహ్వానితులు,  14 మంది ఇన్ చార్జ్ లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా మరో నలుగురు ఈ కమిటీ లో ఉన్నారు.

రఘువీరాతో సహా మొత్తం ఆరుగురు తెలుగు రాష్ట్రాల వారికి చోటు దక్కింది. ఏపీ కోటాలో టి. సుబ్బరామిరెడ్డి, కే. రాజు… తెలంగాణ నుంచి దామోదర్ రాజ నరసింహ శాశ్వత ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కించుకోగా; ప్రత్యేక ఆహ్వానితుల్లో ఏపీ నుంచి పల్లం రాజు, తెలంగాణ నుంచి వంశీ చంద్ రెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్