Saturday, January 18, 2025
HomeTrending Newsనన్ను కూడా అరెస్ట్ చేయండి : రాహుల్

నన్ను కూడా అరెస్ట్ చేయండి : రాహుల్

ప్రధాని మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు అంటించిన వారి అరెస్టులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో వెలసిన నల్ల పోస్టర్లపై పోలీసులు విచారణ జరిపి 12 మందిని పైగా అరెస్ట్ చేశారు.

మా పిల్లలకు వేయాల్సిన వాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపారంటూ ప్రధానిని ప్రశ్నిస్తూ ఢిల్లీ వీధుల్లో కొంతమంది నల్ల పోస్టర్లు అంటించారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు, వీరిలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు, ఆటో రిక్షా డ్రైవర్లు, రోజువారి కూలి పనులు చేసుకునేవారే వున్నారు. కొంతమంది తమకు డబ్బులిచ్చి ఈ పోస్టర్లు అతికించమని చెప్పారని పోలీసులకు వెల్లడించారు.

ఢిల్లీ పోలిసుల అరెస్టులను నిరసిస్తూ ‘అరెస్ట్ మి టూ’ అనే కామెంట్ తో ఆ పోస్టర్ ను జత చేస్తు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ కేరా కూడా ఈ ట్వీట్ కు సమర్ధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్