Thursday, June 11, 2026
Homeస్పోర్ట్స్సెప్టెంబర్లో మహిళా జట్టు ఆస్ట్రేలియా టూర్

సెప్టెంబర్లో మహిళా జట్టు ఆస్ట్రేలియా టూర్

భారత మహిళా క్రికెట్ జట్టు కూడా వరుస సిరీస్ లతో బిజీ బిజీగా గడపబోతోంది. సెప్టెంబర్ లో భారత మహిళా జట్టు తమ దేశంలో పర్యటించే అవకాశం వుందని ఆస్ట్రేలియా మహిళా జట్టు పేస్ బౌలర్ మేగన్ స్కూచ్ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ పర్యటన వివరాలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు త్వరలో ఖరారు చేసే అవకాశాలున్నాయి.

ఇంగ్లాండ్ లో వచ్చేనెలలో మహిళా జట్టు పర్యటించి ఒక టెస్ట్ మ్యాచ్ తో పాటు మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ ఆడనుంది. ఇటివలే ఇంగ్లాండ్ టూర్ కు విడివిడిగా జట్లను ఎంపిక చేసిన బిసిసిఐ కోచ్ గా రమేష్ పొవార్ ను నియమించింది.

ఐతే ఆస్ట్రేలియా పర్యటన మాత్రం కేవలం వన్డే, టి-20 మ్యాచ్ లకు మాత్రమే పరిమితం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular