బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం తెలంగాణ భవిష్యత్ పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న లెక్కలేనితనానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రని సీఎం కేసీఆర్ మరిచిపోయారా’ అని ట్విట్టర్ వేదికగా గురువారం ప్రశ్నించారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. బాసర ట్రిపుల్ ఐటీని బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. తమ డిమాండ్లను నెర వేర్చుకునేదాకా వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. వర్సిటీ ప్రధాన గేటువద్ద ఉదయం 9 గంటలకే బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని మౌనదీక్ష కొన సాగించారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్ డా.సతీశ్‌కుమార్‌ను నియమించినా ఆందోళన విరమించలేదు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు ఏ ఒక్కరూ వెళ్లడానికి వీల్లేకుండా పోలీసులు బందోబస్తు పెంచారు.
Also Read : బాసర విద్యార్థులకు కెటిఆర్ భరోసా