Monday, April 15, 2024
Homeసినిమాప్ర‌భాస్ తో మూవీపై మారుతి క్లారిటీ

ప్ర‌భాస్ తో మూవీపై మారుతి క్లారిటీ

Full length Entertainer: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల త‌ర్వాత అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌తో స్పిరిట్ అనే సినిమా చేయ‌నున్నారు. అయితే.. డైరెక్ట‌ర్ మారుతితో ప్ర‌భాస్ మూవీ అంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈపాటికే సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేద‌ని టాక్ వ‌చ్చింది. ఇలా ఈ మూవీ ఆల‌స్యం అవుతుండ‌డంతో అస‌లు ఈ ప్రాజెక్ట్ ఉందా..?  లేదా..? అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి.

ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తల పై డైరెక్ట‌ర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. మారుతి తెర‌కెక్కించిన తాజా చిత్ర ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. గోపీచంద్ హీరోగా న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్ వ్యూలో మారుతి మాట్లాడుతూ  “ప్ర‌భాస్ కి పెద్ద ఫ్యాన్ ని. ప్ర‌భాస్ తో క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌తో ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తాన‌న్నారు. ఇంకా చెప్పాలంటే… డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లో ప్ర‌భాస్ ఎంత యాక్టీవ్ గా క‌నిపించారో అలా ప్ర‌భాస్ ని చూపిస్తాన‌న్నారు. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా”న్నారు. సో.. ప్ర‌భాస్, మారుతి కాంబినేష‌న్లో మూవీ క‌న్ ఫ‌ర్మ్. కాక‌పోతే ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్