Thursday, March 19, 2026
HomeTrending Newsలండన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ న్యూ గెటప్

లండన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ న్యూ గెటప్

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్‌గాంధీ స్టైల్‌ మార్చారు. ట్రిమ్‌ చేసిన జుట్టు, గడ్డం, మీసంతో ఆయన కొత్త లుక్కుతో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముగిసిన భారత్‌ జోడో యాత్ర ఆసాంతం రాహుల్‌గాంధీ.. పొడవాటి జట్టు, పెరిగిన గడ్డం, మీసాలతోపాటు తెల్లటి టీ-షర్ట్‌లు ధరించి కనిపించేవారు. తాజాగా లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమం కోసం యూకేకు విచ్చేసే వరకు అదే వేషధారణలో కనిపించారు.

కానీ, ఇవాళ ట్రిమ్‌ చేసిన జట్టు, గడ్డం, మీసాలతోపాటు సూటు, టైతో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్‌ల నుంచి రాహుల్‌ నయా లుక్‌పై కామెంట్ల వర్షం కురుస్తున్నది. లండన్‌ పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కీలక ప్రసంగం చేయనున్నారు. అదేవిధంగా అక్కడి భారతీయులతో కాసేపు ముచ్చటించనున్నారు. ‘లిజనింగ్‌-లెర్నింగ్‌ ఇన్‌ ద 21st సెంచరీ’ అనే అంశంపై రాహుల్‌ లెక్చర్‌ ఇవ్వనున్నారు.

భారతదేశపు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీని మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా కేంబ్రిడ్జి బిజినెస్‌ జడ్జి బిజినెస్‌ స్కూల్‌ విజిటింగ్ ఫెలోగా ‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద 21st సెంచరీ’ అనే అంశంపై ప్రసంగం చేయనున్నారు అని కేంబ్రిడ్జి జేబీఎస్‌ మంగళవారం ట్వీట్‌ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular