Friday, May 31, 2024
Homeస్పోర్ట్స్Ind Vs Aus:  స్పిన్ మాయాజాలం : ఇండియా 109 ఆలౌట్;

Ind Vs Aus:  స్పిన్ మాయాజాలం : ఇండియా 109 ఆలౌట్;

మూడో టెస్టులో  ఆసీస్ స్పిన్ బౌలింగ్ దెబ్బకు ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  ఈ పిచ్ పైన బంతి స్వింగ్ కావడంతో బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. తొలిరోజే ఇరు జట్లకూ కలిపి మొత్తం 14 వికెట్లు  స్పిన్ కు దాసోహం కావడం విశేషం.

ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కునెమన్ ఐదు వికెట్లతో రాణించగా, నాథన్ లియాన్-3; మర్ఫీ-1 వికెట్ పడగొట్టారు.

ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ -22; గిల్-21; శ్రీకర్ భరత్-17; ఉమేష్ యాదవ్ -17; రోహిత్-12;  అక్షర్ పటేల్-12 పరుగులు చేయగలిగారు. శ్రేయాస్ అయ్యర్, సిరాజ్ డకౌట్ కాగా, జడేజా-4; అశ్విన్-3; పుజారా-1తో విఫలమయ్యారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ 12 పరుగుల వద్ద తొలి వికెట్ (ట్రావిస్ హెడ్-9) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా- లబుషేన్ లు  రెండో వికెట్ కు 96 పరుగులు జోడించారు. లబుషేన్ 31 రన్స్ చేసి 108వద్ద వెనుదిరగగా, ఆ కాసేపటికే ఖవాజా (60) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా 26 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి  తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 156 రన్స్ సాధించింది. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.  కామెరూన్ గ్రీన్-6; హాండ్స్ కాంబ్-7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లూ రవీంద్ర జడేజాకే దక్కడం గమనార్హం.

Also Read : IND Vs. Aus. 3rd Test: రాహుల్ పై వేటు- షమికి రెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్