Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్రాహుల్ సెంచరీ; పూజారా విఫలం

రాహుల్ సెంచరీ; పూజారా విఫలం

India Vs SA : సెంచూరియన్ టెస్ట్ లో ఇండియా నిలకడగా రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 272 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (122) తన టెస్ట్  కెరీర్ లో ఏడవ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్ -122; అజింక్యా రెహానే-40 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

ఇండియా- సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ నేడు సెంచూరియన్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో మొదలైంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మొదటి వికెట్ కు రాహుల్- మయాంక్ అగర్వాల్ 117 పరుగులు చేశారు. 60 పరుగులు చేసిన మయాంక్,  లుంగీ నిగిడి బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు, ఆ తర్వాతి బంతికే….కొంతకాలంగా వరుసగా విఫలమవుతున్న టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్  పుజారా మరోసారి విఫలమై డకౌట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి రాహుల్ మూడో వికెట్ కు 82 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసిన కోహ్లీ నిగిడి బౌలింగ్ లోనే మల్దర్ క్యాచ్ కు ఔటయ్యాడు.  తొలిరోజు మూడు వికెట్లూ నిగిడి కే దక్కాయి.

కోహ్లీ సేన  ముగ్గురు పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తో  బరిలోకి దిగింది.  స్పిన్ కేటగిరీలో రవిచంద్రన్ అశ్విన్, రైట్ ఆమ్ మీడియం ఫాస్ట్ బౌలర్ – ఆల్ రౌండర్ కేటగిరీలో శార్దూల్ ఠాకూర్ కు అవకాశం కల్పించారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్