Sunday, November 24, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్ కు అరుదైన గౌరవం

ఆర్ఆర్ఆర్ కు అరుదైన గౌరవం

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. గోల్డన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆస్కార్ బరిలో ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ నిలిచి చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. విషయం ఏంటంటే…  రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ్ ఇద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ పాడిన విషయం తెలిసిందే. వారికి ఇప్పుడు అరుదైన అవకాశం దక్కింది. ఈ ఇద్దరూ ఏకంగా అకాడమీ స్టేజీ మీద నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సూపర్ ఛాన్స్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఏకంగా అకాడమీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసింది. దీంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ చేసిన డ్యాన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటకు స్వరవాణి కీరవాణి సంగీతం అందించారు. లిరిసిస్ట్ చంద్రబోస్ రచించగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. మార్చి 12న 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరగనుంది. భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావాలని భారతీయులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి రాజమౌళిని అభినందించడంతో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. మార్చి 12న ఏం జరగనుందో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ అయినా వస్తుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్