Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Cricket-Zimbabwe Tour: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్

Cricket-Zimbabwe Tour: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్

జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు బిసిసిఐ జట్టును ప్రకటించింది. శిఖర్ ధావన్ కే పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్ లకు విశ్రాంతి ఇచ్చింది. జింబాబ్వేలోని హరారే లో ఈ మూడు మ్యాచ్ లు ఆగస్ట్ 18 నుంచి 22 మధ్యలో జరగనున్నాయి. ఇటీవలే వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ధావన్ నేతృత్వంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. 14 మ్యాచ్ లలో 413  పరుగులు రాబట్టాడు. వీటిలో మూడు అర్ధ సెంచరీ లు కూడా ఉన్నాయి.

మరోవైపు గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ కు కూడా అవకాశం కల్పించారు.

జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్