భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని, అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఆ డబ్బు అదాని ది కాదు. అది ఎవరిదో చెప్పాలని అడిగానన్నారు. అనర్హత వేటు తర్వాత ఈ రోజు ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధి బిజెపి పాలనపై దుమ్మెత్తి పోశారు. అదానీ-ప్రధాని మోడి సంబంధంపై సమగ్రంగా మాట్లాడాననని, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడి ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని విమర్శించారు.
ఇదే విషయంపై నేను పార్లమెంటులో మాట్లాడితే, రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. విమానాశ్రయాలను అదానీకి గంపగుత్తగా అప్పగించారని…ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేశారని ఆరోపించారు. పార్లమెంటులో నా గురించి మంత్రులు అనేక ఆరోపణలు చేశారని, పార్లమెంట్‌లో ఒక సభ్యుడిపై ఆరోపణలు చేసినప్పుడు వాటికి జవాబు ఇచ్చే హక్కు ఆ సభ్యుడిగా ఉంటుందన్నారు. ఆ ప్రకారమే నేను స్పీకర్‌ను నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కోరాను. కానీ అవకాశం ఇవ్వలేదన్నారు.
అదానీ కంపెనీల్లో ఉన్న ఆ రూ. 20 వేల కోట్లు ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నేను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటానన్నారు. నేను పార్లమెంట్ లో మాట్లాడిన స్పీచ్ ను తొలగించారని, ఆదాని అంశంను పక్క దారి పట్టించుకోవాడనికే నా పై అనర్హత వేటు వేశారని మంది పడ్డారు. ప్రజల్లో ఉంటాను…భారత్ జోడో యాత్ర తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళాను అని రాహుల్ గాంధీ చెప్పారు.