Friday, March 29, 2024
HomeTrending Newsతూర్పుతీరంలో భారీ వర్ష సూచన

తూర్పుతీరంలో భారీ వర్ష సూచన

అండమాన్ తీరం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం……. మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 22 తేదీ నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని I.M.D. తెలిపింది. అనంతరం ఇది తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో… ఒరిస్సా, కోస్తాంధ్ర తీరంలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

రాబోయే రెండు రోజులు విస్తారంగా విస్తారంగా వర్షాలు పాడుతాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ప్రజలు, మత్స్యకారులు అత్యవసరమైతే కాని బయటకు రాకుడని స్పష్టం చేసింది. మరోవైపు అత్యవసర సాయం కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్