Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘జీ 5’లో ‘రాజ రాజ చోర’ విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ… అనేక మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి ‘జీ 5’ కృతజ్ఞతలు చెప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ‘రాజ రాజ చోర’ చూడమని ప్రజలకు చెప్పారు.

కుటుంబ సభ్యులతో ఈ సినిమా చూడమని దర్శకుడు శ్రీవాస్ తన కోరితే… సీనియర్ రచయిత గోపి మోహన్ ఈ సినిమా ఒక ‘జెమ్’ అని అభివర్ణించారు. రచయిత – దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో “మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే… ఇప్పుడు డిజిటల్  తెరపై చూసే అవకాశం మీ దగ్గరకు వచ్చింది” అన్నారు. ‘రాజ రాజ చోర’ బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత – దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు.

టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుండి డిజిటల్ మీడియా వరకు… ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ… సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే ‘రాజ రాజ చోర’ ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. ‘జీ 5’లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com