Saturday, June 13, 2026
Homeసినిమాజక్కన్న డెడ్ లైన్ పెట్టారా..?

జక్కన్న డెడ్ లైన్ పెట్టారా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీపై ఇప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు.  ప్రస్తుతం మహేష్‌ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ లో ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయమని చెప్పకనే చెప్పారట జక్కన్న. అందుకనే మహేష్‌ ఉదయం 7 గంటలకే షూటింగ్ స్పాట్ కి చేరుకుంటున్నారు. జెట్ స్పీడులో త్రివిక్రమ్ ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మహేష్.. రాజమౌళి సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇంకాస్త హ్యాండ్సప్ గా కనిపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు జక్కన్న.

ఇప్పటి వరకు రాజమౌళి సినిమా అంటే మూడేళ్లు దాటేస్తుంది. ఈసారి అలా కాకుండా సంవత్సరం షూటింగ్ చేసి.. మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఫాస్ట్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకనే మహేష్‌ కి జక్కన్న డెడ్ లైన్ పెట్టారని.. తెలిసింది. ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ అవార్డ్ దక్కించుకోవడం.. ఆస్కార్ బరిలో నిలవడంతో జక్కన్న టాలెంటె హాలీవుడ్ మేకర్స్ కి బాగా తెలిసింది. ఇప్పుడు మహేష్ తో చేయనున్న మూవీ పై హాలీవుడ్ లో  కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read : మహేష్‌ మూవీతో రాజమౌళి రికార్డుల దగ్గరకు వెళతారా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular