Sunday, May 19, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా తీసిన ‘బాహుబలి  2’ కూడా సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఆతర్వాత ‘బాహుబలి 3’ కూడా ఉందని రాజమౌళి గతంలో ప్రకటించారు. అప్పటి నుంచి ఉంటుందా..? ఉంటే ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఆతర్వాత జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ స్టార్ట్ చేయడంతో బాహుబలి 3 గురించి జనాలు మరచిపోయారు.

బాహుబలి సినిమా వలే.. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించడం.. ఆస్కార్ బరిలో కూడా నిలవడం ఆసక్తిగా మారింది. అయితే… రీసెంట్ గా చికాగోలో అభిమానులతో ముచ్చటించిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పారు. నాన్న విజయేంద్రప్రసాద్ తో సీక్వెల్ గురించి చర్చించామని.. దీనికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత నుంచి సీక్వెల్ పై వార్తలు వస్తున్నాయి కానీ.. నిజం కాదేమో అనుకున్నారు సినీజనాలు. ఇప్పుడు స్వయంగా రాజమౌళినే చెప్పడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. రాజమౌళి చెప్పినట్టుగా సీక్వెల్ ఉంటుందా.?  లేకపోతే బాహుబలి 3 గురించి మరిచిపోయినట్టుగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మరచిపోవాల్సివస్తుందా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : జపాన్ లో దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్