Saturday, January 18, 2025
Homeసినిమామహేశ్ అడ్వెంచరస్ మూవీని అలా ప్లాన్ చేశారట!

మహేశ్ అడ్వెంచరస్ మూవీని అలా ప్లాన్ చేశారట!

మహేశ్ బాబు ఆ మధ్య వరుస విజయాలను అందుకుంటూ తన జోరు చూపించాడు. అయితే ఎంతో ప్లాన్ చేసుకుని చేసిన ‘గుంటూరు కారం’ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆ తరువాత సినిమాను ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయనుండటంతో, ఆ ప్రాజెక్టుపై అంతా దృష్టిపెట్టారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది అడ్వెంచరస్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కావడం వాళ్లలో మరింత ఉత్కంఠను పెంచుతోంది.

సాధారణంగా రాజమౌళి సినిమాలు స్టూడియోస్ లోనే ఎక్కువ చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. భారీ సెట్లలనే ఎక్కువ చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. ‘బాహుబలి’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాల చిత్రీకరణ బయట లొకేషన్స్ లో జరిగింది చాలా తక్కువ. అందువలన మహేశ్ మూవీ కోసం ఎక్కడైనా భారీ సెట్స్ వేస్తున్నారా? అనే ఒక ఆసక్తితో అభిమానులు ఉన్నారు. కానీ అందుకు సంబంధించిన హడావిడి అయితే ఎక్కడా కనిపించడం లేదు. అందుకు కారణం ఈ సినిమా చిత్రీకరణ విదేశాల్లో ప్లాన్ చేయడమేననేది తాజా సమాచారం.

కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ విదేశాలలో ఎక్కువభాగం నడుస్తుంది. అందువలన తొలి షెడ్యూల్ ను కూడా విదేశాల్లోనే ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. రాజమౌళి ప్రతి విషయంలో తన ప్రత్యేకతను చాటుతూ ఉంటారు. ఇంతవరకూ కెమెరా పెట్టని లొకేషన్స్ ను ఆయన ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సారి గ్రాఫిక్స్ ను పక్కన పెట్టేసి, లొకేషన్స్ ను హైలైట్ గా నిలపనున్నారన్నమాట. చూడాలి మరి ఈ డిఫరెంట్ కంటెంట్ తెరపై ఎలాంటి విన్యాసాలు చేస్తుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్