Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: లక్నో పై రాజస్థాన్ గెలుపు

ఐపీఎల్: లక్నో పై రాజస్థాన్ గెలుపు

RR beat LSG: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్  విజయం సాధించింది.  చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో  మూడు పరుగులతో రాజస్థాన్ దే పైచేయి అయ్యింది.  రాజస్థాన్ జట్టులో బ్యాటింగ్ లో…. హెట్మెయిర్, పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్ రాణించగా, బౌలింగ్ లో యజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముంబై  వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ లో హెట్ మెయిర్-59 (36 బంతుల్లో 1ఫోర్  6సిక్సర్లు ), పడిక్కల్-29 (29 బంతుల్లో 4 ఫోర్లు ); రవిచంద్రన్ అశ్విన్-28 (23 బంతుల్లో 2 సిక్సర్లు ) చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ చెరో రెండు, అవేష్ ఖాన్  ఒక వికెట్ పడగొట్టారు.

లక్నో పరుగుల ఖాతా తెరవక ముందే తొలి వికెట్ (కెప్టెన్ రాహుల్ డకౌట్) కోల్పోయింది.  రెండు పరుగుల వద్ద కృష్ణప్ప గౌతమ్ కూడా డకౌట్ అయ్యాడు. జేసన్ హోల్డర్ కేవలం 8 పరుగులే చేసి జట్టు స్కోరు 14 వద్ద ఔటయ్యాడు.  మరో ఓపెనర్ డికాక్ 32 బంతుల్లో  2 ఫోర్లు, 1సిక్సర్ తో 39పరుగులు చేశాడు. దీపక్ హుడా 25; క్రునాల్ పాండ్యా 22 పరుగులు చేశారు.

చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరం కాగా 19 వ ఓవర్లో స్టయినిష్ కొట్టిన రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో కలిపి మొత్తం 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్ లో  15 పరుగులు అవసరం కాగా బౌలర్ కుల్ దీప్ సేన్ వేసిన తొలి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది… తర్వాతి మూడు బంతుల్లో పరుగులు చేయడంలో స్టయి నిష్ విఫలమయ్యాడు. చివరి రెండు బంతులను వరుసగా ఫోర్, సిక్స్ గా మలిచినా లాభం లేకపోయింది. మూడు పరుగులతో  రాజస్థాన్ విజయం ఖాయమైంది.

యజువేంద్ర చాహల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : ఐపీఎల్: కోల్ కతాపై ఢిల్లీ గెలుపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్