Thursday, June 11, 2026
Homeసినిమాబాలయ్య  సినిమాకి హైలైట్ గా రాజస్థాన్ ఎపిసోడ్!

బాలయ్య  సినిమాకి హైలైట్ గా రాజస్థాన్ ఎపిసోడ్!

బాలయ్య తన కెరియర్లో ఎప్పుడూ కూడా గ్యాప్ రాకుండా చూసుకున్నారు. అలాగే తన సినిమాల్లో మాస్ అంశాలు మిస్సవ్వకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. బాలయ్య సినిమా అంటే భారీతనానికి లోటు ఉండదనే ఒక నమ్మకాన్ని కలిగించారు. ఈ మధ్య కాలంలో ఆయన ఒకదానికి మించి మరొకటి విజయాలను అందిస్తూ వచ్చారు. అలాంటి బాలయ్య తాజా చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలావరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమాకి తదుపరి షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. రెండు వారాల పాటు యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బాలయ్య అభిమానులు విజిల్స్ వేసేలా తెరపై ఈ యాక్షన్ సీన్స్ అలరిస్తాయని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని టాక్.

సితార బ్యానర్ పై ఇంతవరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరనుంది. ప్రగ్యా జైస్వాల్ ప్రధానమైన కథానాయికగా నటిస్తుండగా, మిగతా ముఖ్యమైన పాత్రలలో ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరి గ్లామర్ టచ్ ఇవ్వనున్నారు. బాలకృష్ణ బందిపోటుగా ఈ సినిమాలో కనించనున్నాడని అంటున్నారు. ఇది ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది. ఈ సినిమాకి ‘వీర మాస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దానినే ఖరారు చేస్తారేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular